జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 44 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. సోమవారం ఈ విషయాన్ని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.
రాజ్‌పోరా నుంచి అర్షిద్ భట్, షోపియాన్ నుంచి జావేద్ అహ్మద్ ఖాద్రీ, మొహమ్మద్ రఫీక్ వానీ అనంతనాగ్ వెస్ట్ నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు.
అనంత్‌నాగ్ అసెంబ్లీ స్థానం నుంచి సయ్యద్ వజాహత్ పోటీకి దిగుతుండగా కిష్టవార్ టికెట్ సుశ్రీ షగున్ పరిహార్ కు దక్కిది. ఇక దోడా నుంచి గజయ్ సింగ్ రాణా బ్యాలెట్ ఫైట్ కు సిద్ధమయ్యారు.
ఇక రియాసి శాసనసభ స్థానానికి కమలం గుర్తుపై నుంచి కుల్దీప్ రాజ్ దూబే, శ్రీ మాతా వైష్ణో దేవి నుంచి రోహిత్ దూబే, పూంచ్ హవేలీ నుంచి చౌదరి అబ్దుల్ ఘనీ, ఉదంపూర్ వెస్ట్ నుంచి పవన్ గుప్తా, రామ్‌గఢ్ (ఎస్సీ) స్థానం నుంచి డాక్టర్ దేవిందర్ కుమార్ మణియాల్, అఖ్నూర్ నుంచి మోహన్ లాల్ భగత్ పోటీ చేయనున్నారు.
జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. జమ్ము కశ్మీర్ శాసనసభలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.