రాజకీయ అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. పారా బలగాలైన అన్సార్ సభ్యులు, విద్యార్థులకు మధ్య చెలరేగిన అల్లర్లలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 60 మంది పారా బలగాల సభ్యులు గాయపడినట్లు తెలుస్తోంది. గ్రామరక్షకులుగా ఉన్న అన్సారీ సభ్యులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. దీనికి యూనస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో విద్యార్థి సంఘాలు మరోసారి ఆందోళన బాటపట్టాయి.
ఆదివారంనాడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వారి నిరసనను అన్సారీ సభ్యులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర హింస చెలరేగింది. దేశంలో శిఖరంలా సమస్యలు ఉన్నాయని, అందరూ సంయమనం పాటించాలని తాత్కాలిక ప్రధాని యూనస్ పిలుపునిచ్చారు. అయితే ఘర్షణలు మాత్రం చల్లారలేదు. అల్లర్లను అదుపు చేసేందుకు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు