భార్య అతిగా ఖర్చు చేస్తోందని ఓ భర్త సుఫారీ ఇచ్చి మరీ కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అసలు చేతికి మట్టి అంటకుండా భార్యను లేపేసినా, సీసీటీవీ ఫుటేజీ ఎలా పట్టించిందో పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం.
గ్వాలియర్‌కు చెందిన అజయ్, సమీప ప్రాంతానికి చెందిన ముస్కాన్ ఇద్దరికీ ఓ కోచింగ్ కేంద్రంలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. 6 నెలల శిక్షణ ముగియగానే ముస్కాన్ ఆమె సొంతూరికి వెళ్లిపోయింది. ముస్కాన్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. రెండేళ్లలో వివాదాలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చింది. మరలా అజయ్‌తో ప్రేమ మొదలు పెట్టింది. తరవాత కొద్ది కాలానికి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఎంజాయ్ చేశారు. ముస్కాన్ ఖర్చులు భరించలేక పలుమార్లు అజయ్ హెచ్చరించాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు.
భార్య ముస్కాన్ ఖర్చులు భరించలేని భర్త రూ.2.5 లక్షలు సుఫారీ ఇచ్చి మరీ రోడ్డు ప్రమాదంలో చంపించాడు అజయ్. ఆ తరవాత భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని ప్రచారం చేశాడు. అనుమానం రావడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ( cctv footage) పరిశీలించారు. రోడ్డుకు పక్కగా వెళుతోన్న ముస్కాన్‌ను కావాలనే కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు. దుండగుడిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించడంతో అజయ్ అరాచకం వెలుగులోకి వచ్చింది. అజయ్‌ను విచారించగా భార్య ఖర్చులు భరించలేకే రోడ్డు ప్రమాదంలో (road accident) చంపించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు.