పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడులకు దిగింది. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినప్పటి నుంచి రగిలిపోతోన్న హెజ్బొల్లా ప్రతీకారదాడులకు దిగింది. దాదాపు 650కిపైగా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఉగ్రవాదులు చేస్తోన్న దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టింది. దాదాపు వంద యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. హెజ్బొల్లా రాకెట్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. హెజ్బొల్లాదాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకాధికారి ఒకరు మరణించారు. పదుల సంఖ్యలో హెజ్బొల్లా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేయడంతో ఎర్రసముద్రంలో అమెరికా బలగాలను పెంచుతోంది. ఇప్పటికే ఓ యుద్ధనౌకను రప్పించింది. మరిన్ని దళాలను ఇజ్రాయెల్‌ను అనుకూలంగా పోరాడేందుకు సిద్దం అవుతోంది. ఇరాన్ నేరుగా యుద్ధభూమిలోకి దిగితే అమెరికా దళాలు రంగంలోకి దిగే అవకాశముందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మూడోప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని అమెరికా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.