ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాలలకు బెంగాల్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు నిరసన ర్యాలీల్లో పొల్గొన్నారు. బడి నిర్వహించాల్సిన సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలకు విద్యార్థులను తీసుకెళ్లడంపై బెంగాల్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ర్యాలీలకు బాలలను తీసుకెళ్లడం నేరమని సంజాయిషీ ఇచ్చుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
ఆర్జీ కర్ ఆసుపత్రి కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్‌కు సీబీఐ ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. త్వరలో లై డిటెక్టర్ పరీక్షలు చేయనున్నారు. మరో నలుగురు అనుమానితులకు కూడా లై డిటెక్టర్ నిర్వహించనున్నారు. సంజయ్ ఘోష్ అక్రమాస్తులను వెలికితీసేందుకు సీబీఐ దాడులు చేస్తోంది. ఇవాళ ఉదయం సంజయ్ ఘోష్‌కు చెందిన 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు.