రుతుపవనాలు చురుగ్గా మారాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. చురుగ్గా మారిన రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా 20 రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలోనూ రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండి తెలిపింది.
ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ( imd weather report) ఉరుములతో కూడిన భారీ వర్షాలు (heavy rains) పడతాయని ఐఎండి హెచ్చరించింది. సముద్రతీరం వెంట అలలు ఉధృతంగా ఎగసిపడతాయని పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉత్తర తెలంగాణలో, ఏపీలోని పలు ప్రాంతాల్లో 2 నుంచి 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.