డాక్టర్లపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఘటన మరువకముందే తిరుపతి స్విమ్స్‌లో ఓ మహిళా డాక్టరుపై రోగి దాడికి దిగడం సంచలంగా మారింది.దాడిని ఖండిస్తూ డాక్టర్లు నిరసనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బంగార్రాజు అనే రోగి మద్యానికి బానిసయ్యాడు. అతని మానసిక స్థితి కూడా అదుపుతప్పింది. ఇటీవల మెరుగైన చికిత్స కోసం బంగార్రాజును అతని బంధువులు తిరుపతి స్విమ్స్‌కు తీసుకువచ్చారు. చికిత్స చేస్తోన్న మహిళా డాక్టర్‌పైనే దాడికి దిగాడు. దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దాడి ఘటనతో ఆసుపత్రి డాక్టర్లు నిరసనకు దిగారు.
స్విమ్స్‌లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో పోలీసులు చేరుకున్నారు. రోగిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా డాక్టర్లు నిరసన విరమించలేదు. టీటీడీ ఈవో రావాలంటూ నిరసనకు దిగారు. తమ రక్షణకు భరోసా లేకుండా,విధులు నిర్వర్తించలేమని డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు.