కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులను అందించిన విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో కలిసి ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ – పీసీఆర్ పేరుతో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది.
ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని మెడ్‌టెక్ వెల్లడించింది. ఈ కిట్ కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుంచి అత్యవసర అంగీకారం లభించిందని ప్రకటనలో వివరించింది. ఆరోగ్య రంగంలో దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సీఈవో జితేంద్ర శర్మ వివరించారు. రెండు వారాల్లో మార్కెట్లోకి కిట్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.