సముద్రతీరంలో సేద తీరడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. సెలువురోజుల్లో పర్యాటకులతో బీచ్ లు కళకళ లాడుతుంటాయి. ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా చిన్నారుల్లా మారిపోతారు.
అలలు కాస్త వెనక్కి వెళితే రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే మరింత అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనే వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లడంతో తీరంలోని పెద్దపెద్ద రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగారు.