ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ నివాసాలతోపాటు, ఏకకాలంలో 15 చోట్ల సీబీఐ దాడులు చేసింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలంలో సంజయ్ ఘోష్ చేసిన అవినీతిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఆసుపత్రిలో అనాథ శవాలను కూడా సంజయ్ ఘోష్ అమ్ముకున్నాడని సీబీఐ గుర్తించింది. శనివారంనాడు ఘోష్‌కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు ఢిల్లీ నుంచి నిపుణులను రప్పించారు.
మూడు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ దూకుడు (cbi raids) పెంచింది. ఘోష్ సహా మరో ముగ్గురికి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పలు అవకతవకలు పాల్పడినట్లు సంజయ్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.