టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లే బోర్గెట్ విమానాశ్రయంలో పావెల్‌ను అరెస్ట్ చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గెట్ విమానాశ్రయంలో దిగగానే పారిస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే పావెల్‌పై మోసం, సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయని పారిస్ పోలీసులు తెలిపారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకే పావెల్‌ను (telegram ceo pavel arrest) అదుపులోకి తీసుకున్నట్లు పారిస్ పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడంలాంటి తీవ్రమైన కేసులు ఉన్నా పావెల్ పారిస్ రావడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ పావెల్‌ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.