రాయలసీమలో ఓ రైతును అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొక్కింది. జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. వ్యవసాయకూలీకి రూ.12 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాల కోసం రైతులు వెతుకుతారు.