మహారాష్ట్రలోని పుణేలో ఈ మధ్యాహ్నం ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరూ మరణించలేదు.
ఎడబ్ల్యు 139 హెలికాప్టర్ ముంబైలోని జుహూ ప్రాంతం నుంచి బయల్దేరి, హైదరాబాద్ వెడుతోంది. పుణే జిల్లాలోని పాడ్ గ్రామం వద్ద కుప్పకూలిపోయింది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదని ప్రాథమిక సమాచారం.
‘‘హెలికాప్టర్ కెప్టెన్ ఆనంద్‌కు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురి పరిస్థితీ బాగానే ఉంది. ఆ హెలికాప్టర్‌ను గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది’’ అని అధికారులు వెల్లడించారు.
మూడు నెలల క్రితం, అంటే మే నెలలో ఒక ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. శివసేన నాయకురాలు సుష్మా అంధారే కోసం వెడుతున్న హెలికాప్టర్, ల్యాండింగ్ సమయంలో ఉన్నట్టుండి కూలిపోయింది. ఆ చాపర్ పైలట్, ప్రమాదాన్ని పసిగట్టి దూకేసి ప్రాణాలు రక్షించుకోగలిగాడు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణే, సతారా జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రం మీద ఉన్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో దాదాపు మహారాష్ట్ర అంతటా వర్షాలు విరివిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు