వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి యత్నం కేసుల్లో ఆయన అరెస్టు అయ్యారు. దాదాపు 58 రోజులపాటు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
హైకోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం మాచర్లకు వెళ్లారు. పిన్నెల్లి విడుదలవుతున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు జైలు వద్దకు వెళ్లారు.