ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త తలాక్ చెప్పాడు. ఈ ఘటన పై కేసు నమోదు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయోధ్యను అభివృద్ధి చేసినందుకు గాను ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీని ఆమె ప్రశంసించింది. అయితే ఈ విషయంపై తనతో విబేదించిన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు ఆమె ఆరోపించింది. భర్తతో పాటు అత్త, ఇతర కుటుంబ సభ్యులు తనను కొట్టినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో నిఖా జరిగింది.
పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తారింటిలో ఉంటున్న మహిళకు అక్కడి రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, వాతావరణం నచ్చాయి. దీంతో భర్త ఎదుటే ఆమె సీఎం యోగి, ప్రధాని మోదీని తీరును అభినందించింది. దీంతో ఆగ్రహించిన భర్త అర్షద్ భార్యను హింసించాడు. ఈ విషయమై కేసు నమోదైంది.