ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే ఫార్మాసిటీలో జరిగిన పేలుడులో నలుగురు గాయపడ్డారు. నేడు చిత్తూరు జిల్లాలో మరో విషాదం చోటుచేసుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ బాషా, ఆయన భార్య షహీనా ప్రాణాలు కోల్పోయారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
బాణసంచా అమ్మకాల లైసెన్స్ పేరిట తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిల్వ ఉంచిన నల్లమందే పేలుడుకి కారణమా అనే కోణంలో విచారణ జరుగుతుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు