భారత క్రికెటర్ శిఖర్ ధావన్, దేశీయ, అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికారు. దాదాపు 14 ఏళ్ళగా వివిధ టోర్నీల్లో ఆడిన శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలకడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున చివరి టోర్నీ ఆడాడు. శిఖర్ ధావన్ తన కెరీర్లో మొత్తం 24 సెంచరీలు చేయగా దాంట్లో 17 వన్డేల్లో చేయగా మిగతా ఏడు టెస్టుల్లో చేశాడు.
రిటైర్మెంట్ విషయాన్ని ఎక్స్ అకౌంట్లో ధావన్ వెల్లడించాడు ఎన్నో జ్ఞాపకాలను మోసుకెళ్తున్నాని , అభిమానుల ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఆ వీడియోను పోస్టు చేశాడు.
శిఖర్ ధావన్ వన్డేల్లో 5వేల పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన 8 మంది బ్యాటర్లలో అతను ఒకడిగా నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి రోహిత్, కోహ్లీ మాత్రమే ఉన్నారు.
భారత్ తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ధావన్, టెస్టుల్లో 2,315, వన్డేల్లో 6,793, టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు.