భారతదేశం మొట్టమొదటిసారిగా మళ్ళీ వినియోగించగల రాకెట్‌ను ప్రయోగించింది. తమిళనాడుకు చెందిన స్టార్టప్ కంపెనీ స్పేస్ జోన్ ఇండియా, మరో కంపెనీ మార్టిన్ గ్రూప్‌తో కలిసి ఈ హైబ్రిడ్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ఉదయం చెన్నైలోని తిరువిదండై ప్రాంతం నుంచి ‘‘ఆర్‌హెచ్‌యుఎంఐ-1’’ రాకెట్‌ను ప్రయోగించారు. ఆ రాకెట్‌ను మొబైల్ లాంచర్ సహాయంతో సబ్-ఆర్బిటల్ ట్రాజెక్టరీలోకి పంపించారు.
ఆ రాకెట్‌లో 3 క్యూబ్ శాటిలైట్లు, 50 పికో శాటిలైట్లు ఉన్నాయి. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అంశాలపై పరిశోధన కోసం ఆ శాటిలైట్లు సమాచారాన్ని సేకరిస్తాయి.
ఆర్‌హెచ్‌యుఎంఐ రాకెట్‌లో జనరిక్ ఫ్యూయెల్ ఆధారిత హైబ్రిడ్ మోటర్, విద్యుత్తుతో పనిచేసే పారాచూట్ డిప్లాయర్ ఉన్నాయి. ఈ రాకెట్ 100శాతం పైరోటెక్నిక్-ఫ్రీ, టిఎన్‌టి అసలు లేదు.
ఈ మిషన్‌ను స్పేస్ జోన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మహాలింగం నిర్వహించారు. ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మైలస్వామి అన్నాదురై మార్గదర్శకత్వం వహించారు.
ఈ రాకెట్ సమర్ధతను పెంచడానికి, నిర్వహణా వ్యయాలు తగ్గించడానికీ ఇందులో లిక్విడ్, సాలిడ్ ప్రొపెల్లెంట్ సిస్టమ్స్ రెండింటి ప్రయోజనాలనూ మిళితం చేసారు.
స్పేస్ జోన్ ఇండియా అనేది చెన్నై కేంద్రంగా పనిచేసే ఏరో టెక్నాలజీ కంపెనీ. దాని లక్ష్యం అంతరిక్ష రంగంలో అతి తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ప్రయోగాలు చేయడమే.
ఆ కంపెనీ ఏరోడైనమిక్ సూత్రాలు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ వంటి రంగాల్లో క్షేత్రస్థాయి శిక్షణ అందిస్తుంది. ప్రైవేటు సంస్థలు, ఇంజనీరింగ్-ఆర్ట్స్-సైన్స్ కళాశాలలు, ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. అంతరిక్ష రంగంలో కెరీర్ ఆప్షన్ల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
2023లో ‘డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్’ అనే కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 2500 మందికి పైగా విద్యార్ధులతో ఒక మిషన్ చేపట్టారు. ఆ విద్యార్ధులందరూ డిజైన్ చేసి, ఒక ‘స్టూడెంట్ శాటిలైట్ లాంచ్ వెహికిల్’ నిర్మించారు. ఆ వెహికిల్ 150 పికో శాటెల్లింగ్ రిసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్ క్యూబ్‌ల పే-లోడ్‌ను మోయగలదు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు