ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో అమలైన అమ్మఒడి పథకం పేరును ‘తల్లికి వందనం’ గా విద్యాకానుక పథకం పేరును ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా మార్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
గోరుముద్ద పథకం పేరును ‘డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, నాడు-నేడు పథకం పేరును ‘మన బడి-మన భవిష్యత్’గా కూటమి ప్రభుత్వం మార్చింది. ఇక స్వేచ్చ పథకం పేరును బాలికా రక్షగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆణిముత్యాలు పథకం పేరును ‘అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది.