బస్సులో 40 మంది భారతీయులు
నేపాల్లో ఘోరం జరిగింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న యూపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టనహూన్ జిల్లో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. అనంతరం మళ్ళీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి 14 మృతదేహాలు వెలికి తీశారు. మరో 26 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉండటంతో భారత్ కు చెందిన వాహనంగా తేల్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు