ఆంధ్రప్రదేశ్ లోని పలు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ విషాదం జరిగి 24 గంటలు గడవకు ముందే మరో ప్రమాదం జరిగింది.
పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు కార్మికులకు గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయని తోటి కార్మికులు చెబుతున్నారు. బాధిత కార్మికులు ఝార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం సమాచారం అందిన వెంటనే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.