మద్యం పాలసీ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్5కు వాయిదావేసింది.
లిక్కర్ పాలసీ లో అవకతవకల కేసు విచారణలో భాగంగా సీబీఐ నమోదు చేసిన కేసులో దిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.
సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. సీబీఐ కౌంటర్ దాఖలుకు గడువు ఇస్తూ విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సివస్తోంది.