తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు భక్తులు స్వామివారితో పోటీ పడేలా బంగారు ఆభరణాలు ధరించి దర్శనానికి వచ్చారు. ఇవాళ ఉదయం ముంబైకు చెందిన ముగ్గురు భక్తులు 25 కేజీల బంగారం ధరించి స్వామి వారిని దర్శనం ( tirumala tirupati) చేసుకున్నారు.
కిలోల కొద్దీ బంగారం ధరించి రావడంతో భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. భక్తుల్లో ఒకరు పది కిలోలు, మరొకరు పది, మరొకరు 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించారు. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. వారికి రక్షణగా 15 మంది సెక్యూరిటీని కూడా తెచ్చుకోవడం విశేషం.