కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం ఘటన మరవక ముందే మరొకటి సంచలనంగా మారింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన గురువారం జరిగింది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తోన్న క్రమంలో ముగ్గురు దుండగులు అటకాయించారు. బాలికను సమీపంలోని చెరువు వద్దకు ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాలిక అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. 12 గంటల్లో నిందితులను అరెస్ట్ (gang rape) చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.