ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో అతి భారీ వర్షాలు, వరదలకు నలుగురు నేపాలీలు మృత్యువాత పడ్డారు. రుద్రప్రయాగలోని ఫంటా హెలిపాడ్ సమీపంలో బురదలో కూరుకుపోయి నేపాలీలు చనిపోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మీడియాకు వెల్లడించారు. మూడు రోజులుగా రుద్రప్రయాగలో అతి భారీ వర్షాలు కురుసున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని రాజ్వార్ తెలిపారు.
బురదలో చిక్కుకుపోయి చనిపోయిన నేపాలీల మృతదేహాలను వెలికితీసి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పర్యాటకులు తమ పర్యటన వాయిదా వేసుకోవాలని, అతి భారీ వర్షాలు, వరదలతో వాతావరణం అనుకూలంగా లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.