కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల మందుల కాంబినేషన్‌ను నిషేధించింది. ఇలా మొత్తం 156 ఔషధాలను నిషేధించింది. కొన్ని మందులు కాంబినేషన్లో రోగులకు ఇవ్వడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువుగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ+ పారాసెటమాల్ 125 ఎంజీ, మెఫెనమిక్ యాసిడ్+పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్, పినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ లెవొసెట్రిజిన్, ఫినైల్ప్రైన్+ పారాసెటమాల్ హెచ్‌సీఎల్ కాంబినేషన్ మందులను నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాంబినేషన్ డ్రగ్స్ చాలా ప్రమాదకరమని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నిషేధించిన జాబితాలో మందులు కాంబినేషన్లో ఉపయోగిస్తే చాలా ప్రమాదం పొంచి ఉందని, కొత్త సమస్యలు తలెత్తుతాయని కేంద్రం హెచ్చరించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు