సుప్రీంకోర్టు సూచన మేరకు వైద్యులు సమ్మె విరమించారు. ఆందోళనలు, నిరసనలకు ముగింపు పలికినట్లు దిల్లీ ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ వైద్యులు తెలిపారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఖండిస్తూ 11 రోజులుగా వైద్యసిబ్బంది వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. హత్యాచార ఘటనను విచారిస్తున్న సుప్రీంకోర్టు దర్యాప్తు జరుగుతోందని వైద్యుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆందోళనలు విరమిస్తున్నట్లు వైద్య సంఘాలు ప్రకటించాయి.
దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు వివరించింది. రోగి సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రకటనలో తెలిపింది.