ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 20 నుంచి 24 మధ్య లీడ్స్‌లోని హెడ్డింగ్లీలో జరగనున్న మొదటి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ముగిసిన వెంటనే ఈ రెడ్‌బాల్ సిరీస్ ఆరంభం అవుతుంది. 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూన్ 20న ప్రారంభమై ఆగస్టు 4 వరకు కొనసాగుతోంది. చివరగా టీమిండియా 2021లో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్ 2-2 గా ముగిసింది.
భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ లో మొదటి మ్యాచ్, జూన్ 20-24 మధ్య లీడ్స్ లోని హెడ్లింగ్లీ గ్రౌండ్ లో జరగనుంది. రెండో టెస్ట్ , జూలై 2 నుంచి 6 వరకు ఎడ్జ్‌బాస్టన్( బర్మింగ్‌హామ్)లో జరగనుంది. లండన్ లోని లార్డ్స్ మైదానం లో మూడో టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. నాలుగో టెస్ట్ జూలై 23-27 మధ్య మాంచెస్టెర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. ఆఖరి ఐదో టెస్ట్ లండన్ లోని ది ఓవల్ వేదికగా జూలై31 నుంచి ఆగస్టు4 వరకు జరగనుంది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల