కార్ల అమ్మకాల్లో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ దూసుకెళ్లింది. గడచిన ఏడు నెలల్లో టాటా కంపెనీకి చెందిన పంచ్ మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఆటో మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటూ డైనమిక్స్ ప్రకటించింది. ప్రముఖ బహుళజాతి కంపెనీలను వెనక్కు నెట్టి దేశీయ కార్లతయారీ సంస్థ టాటా రికార్డు అమ్మకాలు చేసింది.
గత ఏడు మాసాల్లో టాటా పంచ్ (tata punch) 1.26 లక్షలు, వేగనార్ 1.16, హ్యుందాయ్ క్రెటా 1.09, సుజుకి బ్రెజ్జా 1.05, మారుతి ఎర్టిగా (maruti ertiga) 1.04 లక్షలు అమ్ముడయ్యాయి.
మారుతి వేగనార్‌ను టాటా పంచ్ దాటిపోవడంపై అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. టాటా కంపెనీ (tata motors) వినియోగదారులకు అన్ని ఇంధనాలు ఉపయోగించే విధంగా వాహనాలను అందుబాటులో ఉంచుతోంది. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జి ఇలా అన్ని వేరియంట్లు అందుబాటులోకి తేవడంలోనే టాటా విజయం దాగి ఉందని ఆటోరంగ నిపుణులు చెబుతున్నారు.