ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అనారోగ్యం పాలైంది. వైరల్ జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతోంది. తీవ్ర జ్వరం రావడంతో కవితను జైలు అధికారులు ఎయిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.
కవిత అనారోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నారు.కవిత బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును (brs mlc kavita) ఆశ్రయించింది. విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.