ఆర్జీ కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో డాక్టర్ హత్య, అత్యాచారం కేసు విచారణలో పురోగతిపై సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసును ఆగష్టు 20న సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో స్టేటస్ రిపోర్టును సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు అందజేసింది. ఇప్పటికే ఈ కేసు మంగళవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది
డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో కేంద్రం తరపును సొలిసిటర్ జనరల్ సహా ఐదుగురు న్యాయవాదులు, బెంగాల్ తరపును సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ సహా 21 మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు.
ఈ ఘటనలపై సుప్రీంకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయని అభిప్రాయపడింది. హత్య, అత్యాచారంపై కేసు నమోదుకు అంత సమయం ఎందుకు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. సాయంత్రం 3 గంటలకు పోర్టుమార్టం చేసిన తరవాత, రాత్రి 11 గంటల నిమిషాల వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ తీరుపై కూడా సుప్రీంకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
ప్రిన్సిపల్ అవినీతి అరాచకాలపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కళాశాలలో అనాథ శవాలను కూడా ప్రిన్సిపల్ అమ్మేశాడని విచారణలో తేలింది. రోగులపై కూడా అసభ్యంగా ప్రవర్తించాడని, ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలపై కూడా విచారణ సాగుతోంది.