విశాఖలో దారుణం వెలుగు చూసింది. రాయపూర్ నుంచి విశాఖ చేరుకున్న రైలు ఇంజన్లో గుర్తు తెలియని వ్యక్తి తల బయటపడింది. లోకోఫైలెట్ ఇంజన్ పరిశీలిస్తుండగా మనిషి తల కనిపించింది. వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తలను స్వాధీనం చేసుకుని కేజీహెచ్‌కు తరలించారు. తల చెదిరిపోయి ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారైంది.
రైలు ప్రయాణం చేసిన మార్గంలో రైల్వే పోలీసులు వెతుకుతున్నారు. దాదాపు 150 కి.మీ పరిధిలో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రైలు పట్టాల వెంట పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలోనూ రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.