ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు.
ఇటీవల భారీ వరద కారణంగా తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకు పోగా కన్నయ్య నాయుడు విజయవంతంగా స్టాప్ లాగ్ అమర్చి నీటి వృథాను అరికట్టారు. సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు.దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ పంటలను రక్షించారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని అభినందించారు. రాష్ట్ర రైతుల తరపున కన్నయ్య నాయుడుకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు