టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ ను సమర్పించాలని కోరారు.
దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయల్దేరారనే విషయం తెలుసుకునేందుకు కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.