బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. వేదిక మారినప్పటికీ, ఈవెంట్‌కు హోస్ట్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపింది.
ఐసీసీ నిర్వహించిన వర్చువల్ బోర్డు సమావేశంలో వేదిక మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ లో జరగాల్సిన ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సభ్యదేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపించలేదు. దీంతో వేదిక మార్పు నిర్ణయం అనివార్యమైంది.
యూఏఈలోని దుబాయ్, షార్జాలోని రెండు వేదికలలో అక్టోబర్ 3 నుంచి 20 మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న యూఏఈ ఇటీవలి కాలంలో క్రికెట్‌కు ప్రధాన కేంద్రంగా మారుతోంది. పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన అనుభవం యూఏఈకి ఉంది.