ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ నేరుగా విచారణ జరిపేందుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఏపీ ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించడంతో పాటు పెంచేందుకు ఈ గెజిట్ మరింత వీలు కల్పిస్తుంది. దిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు వివరించింది.
2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వమే అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.