రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల పేర్లను బీజేపీ ప్రకటించింది. 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనుండగా 9 మంది అభ్యర్థలను ఖరారు చేసింది.
రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, మరో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ను మధ్యప్రదేశ్ నుంచి బరిలోకి దిగనున్నారు. బిహార్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా, ఒడిశా నుంచి మాజీ బీజేడీ నేత మమతా మొహంతా, త్రిపుర నుంచి రాజీబ్ భట్టాచార్జీ బీజేపీ తరఫున పోటీలో ఉండనున్నారు.
అసోం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. పలువురు రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందడంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
రాజ్యసభ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టినవారిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. కామాఖ్య ప్రసాద్ (బీజేపీ), మిసా భారతి (ఆర్జేడీ), వివేక్ ఠాకూర్ (బీజేపీ), దీపేందర్ సింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్‌రాజే భోంస్లే (బిజేపీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ) కూడా రాజ్యసభ సభ్యులుగా ఉంటూనే లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.