ప్రపంచాన్ని భయపెడుతోన్న ‘మంకీ పాక్స్’పై దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
మంకీపాక్స్ సోకిన రోగిని ఇప్పటి వరకు గుర్తించలేదని, భారత్‌లో ఎంపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జ్వరం, దద్దుర్లుతో బాధపడుతున్న వారితో పాటు ఎంపాక్స్ రోగులతో సన్నిహతంగా మెలిగే వారికి పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ స్పష్టం చేసింది. స్క్రీనింగ్, ఐసోలేషన్, చికిత్సపై మార్గదర్శకాలు జారీ చేసింది.
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, శోషరస గ్రంథుల వాపు, చలి, అలసట వంటివి ఉంటే ఎంపాక్స్ లక్షణాలుగా అనుమానించాల్సి ఉంటుంది. అనుమానిత రోగులకు ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేయాలి. అలాగే రోగులను సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలించే వరకు ప్రత్యేకంగా ఉంచాలి. వీరికి ఎయిమ్స్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. ప్రత్యేక అంబులెన్స్‌లు కూడా కేటాయించారు. ఎమర్జెన్సీ స్టాఫ్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.