కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి కేసు నమోదైంది. గత కొంత కాలంగా మెడికల్ కళాశాలలో ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మాజీ ప్రిన్సిపల్‌పై తాజాగా కేసు నమోదు చేశారు. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అవినీతి కేసులో పోలీసులు విచారించారు.
బెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్జీ కార్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌పై కేసు నమోదైంది.ఈ కేసు విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సిట్ అధిపతి ప్రణవ్ కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటికే ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్‌ను సీబీఐ పలు మార్లు ప్రశ్నించింది. జూనియర్ డాక్టర్ హత్య జరిగిన తరవాత, ముందు జరిగిన ఘటనపై మాజీ ప్రిన్సిపల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.జూనియర్ డాక్టర్ హత్య జరిగిన విషయం తెలిసిన 8 గంటల వరకు బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయకపోవడంపై కూడా పను అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.