ఇటలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది. షిప్ లో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతయ్యారు.
సిసిలియన్ పోర్టు నుంచి ఈయాట్ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బందితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో షిప్ మునిగిపోయింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే రక్షణ సిబ్బంది రంగంలోకి దిగారు. నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. బ్రిటన్ వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు కాగా, ఆయన భార్యతో పాటు మరో 14 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతైన వారిలో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నారు. ప్రస్తుతం ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.
గల్లంతైన వ్యాపారవేత్త మైక్ లించ్ (59) అమెరికాలో మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా తేలారు. 1990లోఆటానమీ కార్పొరేషన్ అనే టెక్ కంపెనీని ప్రారంభించారు.