కోల్‌కతా అత్యాచారం, హత్య నిందితుడిని ఉరితీయాలంటూ సంజయ్రాయ్ అత్త దుర్గాదేవి డిమాండ్ చేశారు. సంజయ్ మంచి వాడు కాదని తన కూతురు గర్భవతిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించడంతో ఆమెకు గర్భస్రావం అయిందని దుర్గాదేవి మీడియాకు వెల్లడించారు. రెండు సంవత్సరాలుగా తన కూతురు సంజయ్‌కు దూరంగా తనతోనే ఉంటోందని గుర్తుచేసింది. సంజయ్ చాలా దారుణమైన వ్యక్తి అని, అతన్ని ఉరితీసినా తప్పు లేదని వ్యాఖ్యానించింది.
ఇక కోల్‌కతా ఘటనపై తాను మాట్లాడలేనని దుర్గాదేవి చెప్పారు.అయితే ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం సంజయ్ ఒక్కడి పని కాదని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పలువురు ఉండే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందని మొదట్లో ప్రచారం జరిగినా, ఇప్పటి వరకు పోలీసులు, సీబీఐ ఒక్కడినే అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.