Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

Phaneendra by Phaneendra
Aug 19, 2024, 03:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులతో అసంతృప్తికి లోనవుతున్న ముస్లిం మహిళలు హిందూధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా పీలీభిత్‌కు చెందిన హీనా బి ఖాన్ అనే మహిళ స్వచ్ఛందంగా ఇస్లాంను వదిలిపెట్టి హిందూ జీవన విధానాన్ని ఎంచుకుంది.

హీనా ఖాన్, ప్రియాంకగా మారింది. ప్రేమ్‌శంకర్‌ గుప్తా అనే యువకుణ్ణి వైదిక పద్ధతిలో వివాహం చేసుకుంది. వారి పెళ్ళి బరేలీలోని ఒక ఆశ్రమంలో జరిగింది. తను ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూధర్మంలోకి రావడం వల్ల తన కుటుంబం నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులను రక్షణ కోరింది.

పీలీభిత్ జిల్లాలోని పురాన్‌పూర్ పట్నానికి చెందిన ముంతాజ్‌ ఖాన్ కూతురు హీనా ఖాన్. ఆమె భాగస్వామి ప్రేమ్‌శంకర్ గుప్తా ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్ధమ్‌సింగ్‌ నగర్ జిల్లా, సితార్‌గంజ్ ప్రాంతంలోని సిసోనా గ్రామస్తుడు.

హీనాఖాన్ మతం మారాలన్న తన నిర్ణయాన్ని ధ్రువీకరిస్తూ బరేలీ జిల్లా కలెక్టర్‌కు, సీనియర్ ఎస్‌పికి అఫిడవిట్ అందించింది. తను వయోజనురాలినని, సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తనకుందనీ ఆమె వెల్లడించింది.  

ప్రియాంక తన అఫిడవిట్‌లో మొగలుల చొరబాట్ల సమయంలో వారి భయంతో తన పూర్వీకులు ఇస్లాంలోకి మతం మారారని వెల్లడించింది. ఇప్పుడు ఘర్‌వాపసీ తర్వాత తను సనాతన హిందూ మతానికి చెందినదాన్నని చెబుతోంది. హిందూ దేవీదేవతలను అభిమానంతో కొలుస్తోంది. ఇస్లాంలో మహిళలతో వ్యవహరించే తీరును ఆమె తప్పు పట్టింది. ప్రత్యేకించి ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులంటే తనకు రోత అని తేల్చిచెప్పింది. తను హిందూమతంలోకి మారాలన్న నిర్ణయం పూర్తిగా తనదేననీ, స్వచ్ఛందంగా తీసుకున్నదేననీ చెప్పింది. తనను ఎవరూ నిర్బంధించి మతం మార్చలేదని స్పష్టం చేసింది.

హీనా ఖాన్ మతం మారడాన్ని ఆమె కుటుంబం సహించలేకపోయింది. ఆమెను బంధువులు నిరంతరాయంగా విమర్శిస్తున్నారు. వాళ్ళవల్లనే ఆమెకు, ఆమె భర్తకూ ఎలాంటి ప్రాణాపాయమూ కలక్కూడదని కోరుకుంటోంది. తమ భద్రత గురించి ఆందోళనల వల్ల తన కుటుంబం తమపై దాడి చేయవచ్చని, తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టవచ్చనీ భయపడుతోంది. తమకు వెంటనే భద్రత ఏర్పాటు చేయాలనీ లేనిపక్షంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందనీ ప్రియాంకగా మారిన హీనా ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags: andhra today newsGhar WapsiHeena KhanNikah HalalaPriyankaRohilkhandSLIDERTOP NEWSTriple TalaqUttar Pradesh
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.