అనకాపల్లి జిల్లా కైలాసలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసాలు తిని శనివారంనాడు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇవాళ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చనిపోయిన వారిలో భవాని, శ్రద్ధ, జాషువా ఉన్నారు. మరో 24 మందికి అనకాపల్లి, నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు డీఈవో అప్పారావు తెలిపారు.