కోల్‌కతా ఘటపై ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ వెంటనే స్పందించారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య, అత్యాచార ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ అధికారులను గవర్నర్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఈకేసులో సాధించిన పురోగతిపై, తీసుకోవాల్సిన చర్యలపై వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
కోల్‌కతా ఘటనపై హర్భజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని సాధమైనంత త్వరగా శిక్షించాలని, అప్పుడే బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌పై జరిగిన దురాగతం సమాజంలో పాతుకుపోయిన పురుష దురహంకారానికి నిదర్శనమని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలోనే ఇలాంటి దారుణం జరగడంపై హర్భజన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలో, అధికారుల్లో మార్పులు రావాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తోందన్నారు.