భారత తీర గస్తీ దళ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెన్నై పర్యటనలో ఉండగా రాకేశ్ పాల్ ఐఎన్ఎస్ అడయార్ విధుల్లో ఉన్నారు.ఆ సమయంలో ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చిందని సన్నిహితులు తెలిపారు. వెంటనే చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ తీవ్ర విచారం వ్యకం చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రికి చేరుకుని రాకేశ్ పాల్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన మృత దేహాన్ని ఢిల్లీకి తరలించారు. ఇవాళ ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.