కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న బీజేపీ నేతను ప్రత్యర్థులు గొంతుకోసి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంలో బీజేపీ నేత శేఖన్నను దుండగులు గొంతుకోసి చంపారు.ఎన్నికలకు ముందు శేఖన్న వైసీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ప్రత్యర్థులు శేఖన్నపై పగపెంచుకున్నారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తోన్న శేఖన్నను ప్రత్యర్థులు గొంతుకోసి చంపారు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని ఎస్ఐ తెలిపారు.