కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. అలల దాటికి ఒకరు గల్లంతుకాగా, మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది.
గుడివాడకు చెందిన ఆరుగురు హంసలదీవి బీచ్‌కు వెళ్ళారు. స్నానం కోసం సముద్రంలో దిగగా అలల దాటికి కొట్టుకుపోయారు. వారి అరుపులు విని దగ్గర్లోని ఆటో డ్రైవర్, మైరెన్ పోలీసులు సముద్రంలోకి దిగి ఐదుగురిని రక్షించారు. మరొకరి ఆచూకీ దొరకలేదు. రక్షించిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. గల్లంతైన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు