ఆంధ్రప్రదేశ్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ప్రకటించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సమావేశంలో ఈ అవార్డును కేంద్రం, ఏపీకి ప్రదానం చేసింది. .
ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు కేంద్ర నూతన, పునరత్పాదక ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి లలిత్ బోరా నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ ఏపీ వాటిని అధిగమించి అవార్డును సొంతం చేసుకుంది.
చంద్రబాబు కృషితోనే రాష్ట్రానికి ఈ అవార్డు దక్కిందని కమలాకర్ బాబు అన్నారు. 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అప్పటి ప్రభుత్వం చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందన్నారు.