ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బులంద్ షహర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.పికప్ వ్యాను, ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టుకున్నాయి. దీంతో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
బులంద్ షహర్ లోని ఓ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులను పికప్ వ్యాన్ వారి ఇళ్ళకు తీసుకెళుతుండగా సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో పికప్ వ్యాన్ లోని పదిమంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు.