తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయగోదావరి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, సత్యసాయి, కర్నూలు, కడప, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
గడచిన 24 గంటల్లో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సత్యసాయి జిల్లాలో గరిష్ఠంగా 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదముందని ఐఎండి (imd weather report) హెచ్చరికలు జారీ చేసింది.